గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులతో పాటు స్వచ్ఛంద సంస్థలు సహకారం అందించాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ కోరారు. ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరంలో బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రూ.9లక్షల వ్యయంతో నిర్మించిన నీటి శుద్ధి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
నీటిశుద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన వైరా ఎమ్మెల్యే
ఖమ్మం జిల్లా రెబ్బవరంలో ఓ స్వచ్ఛంద సహకారంతో నిర్మించిన నీటి శుద్ధి కేంద్రాన్ని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు మెరుగుపరుచుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
నీటిశుద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన వైరా ఎమ్మెల్యే
అనంతరం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఎనిమిది వందల కుటుంబాలకు తడి చెత్త, పొడి చెత్త సేకరణ బుట్టలు పంపిణీ చేశారు. పల్లె ప్రగతి స్ఫూర్తితో గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు మెరుగుపరుచుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రధానంగా పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, ఎంపీపీ పావని, సర్పంచ్ రామారావు, అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:ధనార్జనే ధ్యేయంగా కృత్రిమ పాల తయారీ..