చదువుకోవాలన్న కాంక్ష ఉంటే వయసు అడ్డంకి కాదని రుజువు చేస్తూ.. పరీక్షకు హాజరయ్యారు వైరా ఎమ్మెల్యే రాములు నాయక్. ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దూర విద్య ద్వారా ఆయన ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మొదటి సంవత్సరం పరీక్ష రాశారు. ఎమ్మెల్యే డిగ్రీ వరకు చదివిన తర్వాత పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేసి ఎస్సైగా రిటైర్మెంట్ తీసుకున్నారు.
విద్యార్థులతో కలిసి పరీక్ష రాసిన శాసన సభ్యుడు - wyra mla attended exam
అతను ఓ శాసనసభ్యుడు. డిగ్రీ వరకు చదువుకున్నారు. తర్వాత పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించి ఎస్సైగా రిటైరయ్యారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. పీజీ చదవాలనేది తన కోరిక. ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ కోరిక తీర్చుకోవాలనుకున్నారు. తాజాగా ఎంఏ పరీక్ష రాశారు వైరా ఎమ్మెల్యే రాములు నాయక్.
![విద్యార్థులతో కలిసి పరీక్ష రాసిన శాసన సభ్యుడు wyra mla attending the ma examination](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5267971-thumbnail-3x2-df.jpg)
పరీక్ష రాసిన వైరా ఎమ్మెల్యే
జీవితంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలన్న కోరిక మిగిలిపోయిందని అందుకే పరీక్షలు రాస్తున్నానని ఎమ్మెల్యే రాములు నాయక్ తెలిపారు. రాములు నాయక్ 2018లో వైరా నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. అనంతరం తెరాసలో చేరారు.
పరీక్ష రాసిన వైరా ఎమ్మెల్యే
ఇవీ చూడండి: పౌరసత్వ సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం
Last Updated : Dec 4, 2019, 7:58 PM IST