ఖమ్మంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం - ఖమ్మం
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆదివాసీలు డిమాండ్ చేశారు. ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
ప్రపంచ ఆదివాసి దినోత్సవం
ఖమ్మం జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పెవిలియన్ మైదానం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ తీశారు. విద్యార్థులు సంప్రదాయ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అడవుల నుంచి ఆదివాసీలను వెళ్లగొట్టేందుకు ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.
- ఇదీ చూడండి : రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి ప్రవాహం