ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కనకగిరి గుట్టవద్ద ఉన్న మిషన్ భగీరథలోని శుద్ధజల ప్లాంటు కార్మికులు ధర్నా చేపట్టారు. తమకు వేతనాలు తక్కువగా ఇస్తున్నారంటూ మూడు రోజుల నుంచి విధులను బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు.
వీరికి మద్దతుగా మరో ఆరు మండలాల్లో పనిచేస్తున్న 300 మంది కార్మికులు విధులను బహిష్కరించారు. దీనితో సుమారు 150 పంచాయతీల్లో నీటి సరఫరా నిలిచిపోయింది. తాగు నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఖమ్మంలోని పాలేరుతో పాటు ఇతర ప్లాంటుల వద్ద పనిచేస్తున్న కార్మికులకు ఎల్అండ్టీ సంస్థ రూ. 12000 వేతనం ఇస్తుందని.. అదే పనిచేస్తున్న తమకు మాత్రం నాగార్జున కన్స్ట్రక్షన్ సంస్థ రూ.2 వేలు తక్కువగా ఇస్తుందని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని శుద్ధజల ప్లాంటు కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
మూడురోజులుగా పంపు ఆపరేటర్లు, గేట్‌వాల్ ఆపరేట్లరు, లైన్‌మెన్‌లు ధర్నా చేస్తుండడం వల్ల శుద్దజల ప్లాంటు మోటర్లు మూగబోయాయి. ఇది ఇలాగే కొనసాగితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కొందరకు అంటున్నారు.
మిషన్ భగీరథ కార్మికుల ధర్నా..150గ్రామాలకు తాగునీటి కటకట ఇవీ చూడండి:20 వరకు బడ్జెట్ సమావేశాలు.. 8న పద్దు