ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను బేషరతుగా విధుల్లో చేర్చుకోవాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూరులో నిర్వహించిన ఓ ప్రైవేటు వేడుకకు ఆయన హాజరయ్యారు.
ఆర్టీసీ సమ్మె వ్యవహారం హైకోర్టు కార్మిక కోర్టుకు బదిలీ చేయడంతో కార్మికులు విధుల్లో చేరేందుకు సుముఖంగా ఉన్నారని సాంబశివరావు పేర్కొన్నారు. తక్షణమే వారిని విధుల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు.
'కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలి' - latest news on kunamneni
ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ఓ ప్రైవేటు వేడుకకు ఆయన హాజరయ్యారు.
'కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలి'
సమ్మె విరమణను ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశత్వానికి విజయంగా భావించవచ్చన్నారు. కార్మికులు 40 రోజులకు పైగా సమ్మె చేసినా కేసీఆర్ తన మొండి వైఖరి వీడలేదని విమర్శించారు. కార్మికుల కుటుంబాలు జీతాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కార్మికులను ఎటువంటి షరతులు లేకుండా విధుల్లోకి చేర్చుకోవాలన్నారు.
ఇదీ చూడండి : జగిత్యాలలో ఆర్టీసీ కండక్టర్‌కు గుండెపోటు
TAGGED:
latest news on kunamneni