దేశంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నివారణ చర్యలు తీసుకోవడం లేదని నిరసిస్తూ ఖమ్మంలో వామపక్ష మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. పెవిలియన్ మైదానం నుంచి జడ్పీ కూడలి వరకు భారీ ప్రదర్శన చేశారు.
హత్యాచారాలు అరికట్టాలని మహిళా సంఘాల నిరసన - khammam district news
మహిళలు, బాలికలపై జరుగుతున్న హత్యాచారాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదని వామపక్ష మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రం ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.
హత్యాచారాలను అరికట్టాలని మహిళా సంఘాల నిరసన
దేశంలో ఇటీవల చోటు చేసుకుంటున్న సంఘటనలపై ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదని మహిళా నాయకులు ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యాచారాలపై రాష్ట్ర ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకోవాలన్నారు.
ఇవీ చూడండి: కరీంనగర్‌లో గంగవ్వ సందడి.. సెల్ఫీల కోసం యువత పోటీ