ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రేపల్లెవాడలో విద్యుదాఘాతానికి గురై ఓ మహిళా రైతు మృతి చెందింది. గ్రామానికి చెందిన భూక్య సునిత... ఉదయాన్నే పొలం పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి బయలుదేరింది. పొలాల బాటలో వస్తున్న క్రమంలో ఇనుప కంచె ఎదురైంది. కంచె దాటుతుండగా విద్యుత్ సరఫరా అయి అక్కడికక్కడే మృతిచెందింది.
కంచె దాటుతుండగా విద్యుదాఘాతానికి గురై మహిళా రైతు మృతి - farmers news in telugu
ఉదయాన్నే పొలానికి వెళ్లిన ఆ మహిళా రైతు... మధ్యాహ్నం ఇంటికి బయలుదేరింది. పొలాల బాటన వెళ్తున్న ఆమెకు... ఇనుప కంచె రూపంలో మృత్యువు ఎదురైంది. దాటేందుకు ప్రయత్నించిన ఆ మహిళ... విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందింది.
కంచె దాటుతుండగా విద్యుదాఘాతానికి గురై మహిళా రైతు మృతి
సునితకు ఇద్దరు పిల్లలు. పొలానికి వెళ్లిన భార్య విగతజీవిగా కనిపించగా... భర్త ప్రసాద్ బోరున విలపించారు. కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.