హైదరాబాద్‌కు చెందిన స్వాతికి.. ఖమ్మం నగరం పాండురంగాపురానికి చెందిన బాలాజీ నాయక్‌తో 2017లో ఆర్యసమాజ్‌లో వివాహం జరిగింది. మొదట్లో కాంట్రాక్ట్ బేసిక్‌లో పనిచేసే బాలాజీ ఉద్యోగం.. పెళ్లి తర్వాత రెగ్యులర్ అయింది. కొన్నిరోజుల తర్వాత అదనపు కట్నం కోసం స్వాతిని వేధించడం మొదలుపెట్టాడు. భర్త వేధింపులు తట్టుకోలేక స్వాతి.. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
ప్రేమించి పెళ్లాడాడు.. ఉద్యోగం రాగానే వదిలించుకున్నాడు! - woman protest in khammam
నువ్వు లేకపోతే బతకలేనంటూ, ప్రేమిస్తున్నానంటూ ఎన్నో మాటలు చెప్పాడు. ఏడు జన్మలకూ నువ్వే కావాలంటూ వివాహమాడాడు. తన తీయని మాటలను నమ్మి పెళ్లి చేసుకున్న ఆ యువతిని ఉద్యోగం రాగానే పట్టించుకోవడం మానేశాడు. జన్మజన్మలకు తోడుంటానని చెప్పిన భర్త.. కన్న బిడ్డతో సహా ఆమెను ఇంట్లో నుంచి గెంటేశాడు. ఎటు పోవాలో తెలియక, దిక్కు తోచని స్థితిలో.. చంటిబిడ్డతో బస్టాండ్‌లో ఒంటరిగా ఎదురుచూస్తోంది. తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటోంది.

ఉద్యోగం పేరిట బాలాజీ వేరే చోట ఉండగా.. బాబుతో స్వాతి అత్తవారింట్లో ఉండేది. తన వద్దకు వస్తానని బాలాజీని అడగగా ఆమెను కొట్టి పుట్టింటికి పంపాడు. భర్త చర్యలతో విసిగిపోయిన స్వాతి.. మరోసారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మరోసారి కౌన్సిలింగ్ ఇవ్వగా.. తనతో ఉండటం ఇష్టం లేదని, కావాలంటే కేసు పెట్టుకోమని తేల్చేశాడని బాధితురాలు కన్నీటిపర్యంతమయింది. అటు అత్తింటి వారు రానివ్వడం లేదు.. కట్టుకున్న భర్త పట్టించుకోవడం లేదని మూడ్రోజులుగా పార్కుల్లో, బస్టాండుల్లో చంటి పిల్లాడితో తలదాచుకుంటోంది. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. విషయం తెలుసుకున్న ఖమ్మం ప్రగతి శీల మహిళా సంఘం నేతలు వారిని చేరదీసి తమ కార్యాలయంలో ఆశ్రయం కల్పించారు.