ఖమ్మం ఐటీ హబ్-2కి త్వరలో శంకుస్థాపన చేస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ బుధవారం ట్విటర్లో వెల్లడించారు. ఇప్పటికే అక్కడ హబ్ తొలిదశ విజయవంతంగా నడుస్తోందని, దానిని విస్తరించేందుకు రెండో దశను మంజూరు చేశామన్నారు.
ఖమ్మంలో ఐటీ హబ్-2కి త్వరలో శంకుస్థాపన: కేటీఆర్ - minister ktr latest news
ఖమ్మం ఐటీ హబ్-2కి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా ప్రకటించారు.
ఖమ్మంలో ఐటీ హబ్-2కి త్వరలో శంకుస్థాపన: కేటీఆర్
ఐటీహబ్-2 కోసం రూ.36 కోట్ల వ్యయంతో 55వేల చదరపు అడుగుల్లో సౌధం(టవర్) నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందన్నారు. అందులో 570 మంది ఒకేసారి పనిచేసుకునేలా భవన నిర్మాణం జరుగుతుందన్నారు.
Last Updated : Mar 18, 2021, 8:15 AM IST