కరోనా కష్టకాలంలో పేద ప్రజలను ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటోందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన అందజేశారు.
పేదలను ఆదుకోవడంలో ఎల్లప్పుడు ముందుంటాం: పువ్వాడ - ఖమ్మం జిల్లాలో చెక్కుల పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను ఆదుకోవడంలో ఎప్పుడు ముందుంటుందని మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. కరోనా కష్టకాలంలోనూ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు. ఖమ్మం జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంతి సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
పేదలను ఆదుకోవడంలో ఎల్లప్పుడు ముందుంటాం : పువ్వాడ
అర్హులైన పేదలకు రూ.52.28 లక్షల విలువైన చెక్కులను 118 మందికి పంపిణీ చేశారు. తన నియోజకవర్గ ప్రజలకు రూ.4.21 కోట్ల విలువైన చెక్కులను అందించినట్లు మంత్రి వెల్లడించారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడంలో తెరాస ప్రభుత్వం ముందంజలో ఉంటుందని పువ్వాడ పేర్కొన్నారు.