వర్షపు నీరు ఒడిసి పట్టేందుకు ఆ కాలనీ వాసులు నడుంబిగించారు. ఇంటి ముందు ఇంకుడు గుంతల నిర్మాణానికి ముందుకు కదిలారు. ఖమ్మంలోని 13 వ డివిజన్ శ్రీరామ్ నగర్ 14వ వీధిలో ఉద్యమంలా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మొత్తం 35 ఇంకుడు గుంతల నిర్మాణానికి పనులు ప్రారంభించారు. వారి ప్రయత్నానికి స్థానిక కార్పొరేటర్ నిరీషా రెడ్డి తన వంతు సాయం అందించారు. జేసీబీతో గుంతలు తవ్వించారు. వర్షాకాలంలో మురుగు నీరే కాకుండా వర్షపు నీరు భూమిలో ఇంకే విధంగా చేస్తున్నామన్నారు. దీంతో దోమల బెడదా ఉండదని, భూగర్భ జలాలు పెరుగుతాయని వారు చెబుతున్నారు.
ఇంటింటికీ ఇంకుడుగుంత - mass construction of water recharge basins in khammamm
ప్రతి నీటి చుక్కను కాపాడదామని సంకల్పించారు ఆ కాలనీ వాసులు. ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతలు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వారికి స్థానిక కార్పొరేటర్ తోడ్పాటు అందించటంతో కార్యక్రమం విజయవంతం అయ్యింది.
ఇంటింటికీ ఇంకుడుగుంత