ఖమ్మం జిల్లా వైరా పులపాలక సంఘం తొలిసారి సమావేశమైంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పాలకమండలి సభ్యులకు పలు సూచనలు చేశారు. పురపాలక పరిధిలో పన్నులు సక్రమంగా వసూలు చేస్తేనే.. అభివృద్ధి వేగంగా సాగుతుందన్నారు.
పన్నుల వసూళ్లతోనే పురపాలికల అభివృద్ధి : ఖమ్మం కలెక్టర్ - ఖమ్మం వార్తలు
పన్నులు సక్రమంగా వసూలు చేస్తేనే పురపాలిక అభివృద్ధి సులభమవుతుందని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. వైరా పురపాలక సమావేశానికి ఆయన హాజరయ్యారు. పన్నుల వసూళ్లు, ఆదాయ మార్గాల లభ్యతపై పలు సూచనలు చేశారు.
![పన్నుల వసూళ్లతోనే పురపాలికల అభివృద్ధి : ఖమ్మం కలెక్టర్ Waira Municipality First Meeting Collector Gives Suggestions](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7320888-456-7320888-1590248939122.jpg)
పన్నుల వసూళ్లలో అలసత్వం ప్రదర్శిస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. వైరా పురపాలికను జిల్లాలో అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని, పురపాలికకు అవసరం ఉన్న వాహనాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే రాములు నాయక్ తెలిపారు. రూ.30 లక్షల పురపాలక బడ్జెట్ అంచనాలకు ఛైర్మన్ సూతకాని జైపాల్, సభ్యులు ఆమోదం తెలిపారు. పురపాలక సంఘం పరిధిలో పన్నులు రూ.3కోట్లు, ఇతర మార్గాల ద్వారా రూ.27 కోట్లు ఆదాయం సమకూర్చుకునే విధంగా పాలక మండలి ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ స్నేహలత, కమిషనర్ విజయానంద్, వైస్ ఛైర్మన్ సీతారాములు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఆరు గాయాలుంటే ఒకటే అంటారేం..?:హైకోర్టు