తెలంగాణ

telangana

ETV Bharat / state

అంగన్వాడీ కేెంద్రాలకు టీవీల వితరణ - khammam latest updates

ఖమ్మం జిల్లాలోని పలు అంగన్వాడీ కేంద్రాలకు స్వచ్ఛంద సంస్థలు టీవీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కర్ణన్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. సేవా సంస్థల కృషిని కొనియాడారు.

tv distributed to anganwadi centres
అంగన్వాడీ కేంద్రాలకు టీవీల అందజేత

By

Published : Mar 28, 2021, 7:59 PM IST

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో పలు అంగన్వాడీ కేంద్రాలకు ఎన్ఆర్ఐ, వీజిఎఫ్, గురు దక్షిణ ఫౌండేషన్ సంయుక్తంగా టీవీలు అందజేశాయి. మండలంలోని వీఎం బంజరలో ఎంపిక చేసిన 40 అంగన్వాడీ కేంద్రాలకు కలెక్టర్ ఆర్.వి కర్ణన్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చేతుల మీదుగా అందించారు. ఆయా కేంద్రాలను డిజిటలైజేషన్ వైపు మొదటి అడుగు వేసేందుకు కృషి చేస్తున్న సేవా సంస్థలను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల భవిష్యత్తుకు మంచి పునాదులు వేయాల్సిన బాధ్యత అంగన్వాడీ ఉపాధ్యాయులు తీసుకోవాలని సూచించారు.

మాతృ గడ్డపై మమకారంతో జిల్లాలో దాదాపు 1500 పాఠశాలలకు టీవీలు అందించి విద్యార్థులకు డిజిటల్ పాఠాలు అందించేలా వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారని ఎమ్మెల్యే సండ్ర తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు జిల్లాలో దాదాపు 250 స్మార్ట్ టీవీలు అందించే కార్యక్రమాన్ని తీసుకున్నట్లు ఎన్ఆర్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాబు రావు, నాగేశ్వర రావు తెలిపారు.

ఇదీ చదవండి:నాయకత్వం మారితే ఆ పార్టీలో చేరుతా: కొండా విశ్వేశ్వర్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details