ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో వినాయకచవితి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ ఏడాది కరోనా మహమ్మారి నేపథ్యంలో కూడళ్ల వద్ద మండపాలు ఏర్పాటు చేయలేదు. ఎవరికి వారే తమ ఇళ్లలో మట్టి వినాయక ప్రతిమలు ఏర్పాటు చేసుకుని పూజలు చేశారు.
మధిరలో ఇళ్లలోనే వినాయక చవితి పూజలు - గణేష్ చతుర్థి 2020
మధిర నియోజకవర్గంలో ప్రజలు వినాయక చవితి పూజలను నిరాడంబరంగా జరుపుకున్నారు. కరోనా నేపథ్యంలో ఎవరికి వారే తమ ఇళ్లలో మట్టి వినాయక ప్రతిమలను ఏర్పాటు చేసుకుని భక్తితో పూజలు చేశారు.
మధిరలో ఇళ్లలోనే వినాయక చవితి పూజలు
వాసవి క్లబ్ ఆధ్వర్యంలో భక్తులకు మట్టి గణేశుని ప్రతిమలను పంపిణీ చేశారు. మధిర ప్రధాన వీధిలోని విజ్ఞేశ్వర ఆలయంలో మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇవీ చూడండి:గణాధిపతికి ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి