తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ ఊళ్లో విగ్రహాలు కూడా మాస్కులు పెట్టుకున్నాయి...

కరోనా రెండో దశ తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరుపేట గ్రామ పంచాయతీ పాలకవర్గం వినూత్న రీతిలో ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. గ్రామంలో ప్రముఖుల విగ్రహాలకు మాస్కులు ఏర్పాటు చేసి... కరోనా పట్ల ప్రజల్ని చైతన్యపరుస్తోంది.

Villagers wearing masks to idols
Villagers wearing masks to idols

By

Published : May 9, 2021, 2:32 PM IST

పల్లెల్లో కొవిడ్​ మహమ్మారి చాపకిందనీరులా వ్యాపిస్తుంది. వైరస్​ కట్టడికి ఎన్ని మార్గాలు పాటింటినా కేసులు వస్తూనే ఉన్నాయి. మందులేని వ్యాధికి చికిత్స కంటే నివారణే నయం అని గుర్తించిన గ్రామస్థులు మహమ్మారి కట్టడికి చేకులు కలిపారు. గ్రామంలో వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు.

ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరుపేట పాలకవర్గం సభ్యులు కొవిడ్​ కట్టడికి గ్రామంలో వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు. ప్రముఖుల విగ్రహాలకు మాస్కులు వేశారు. గ్రామంలోని కూడళ్ల వద్ద జనం గుమిగూడి ముచ్చట్లు పెట్టకుండా... సిమెంట్ బల్లలను తిరగేసి పెట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద టీకా కార్యక్రమం జరుగుతుండటంతో... ప్రజలు ఒకేచోట చేరకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు.

ఔరా...! ఆ ఊళ్లో విగ్రహాలు కూడా మాస్కులు పెట్టుకున్నాయి...

ఇదీ చూడండి:కొవిడ్​ వార్డులో నర్సు స్టెప్పులు.. వీడియో వైరల్​

ABOUT THE AUTHOR

...view details