ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదనీరు రహదారులపై ప్రవహిస్తుండగా చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రజలు నానా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. కొణిజర్ల మండలం సింగరాయపాలెం గ్రామానికి చెందిన సైదులు అనారోగ్యంతో బాధపడుతుండగా అత్యవసర చికిత్స అవసరమైంది.
పొంగిన వాగుతో నిలిచిన రాకపోకలు.. సాయమందించిన గ్రామస్థులు - పొంగిపొర్లిన పగిడేరు
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం సింగరాయపాలెంకు చెందిన ఓ వ్యక్తికి తీవ్ర అనారోగ్యం రాగా.. అతనికి అత్యవసర చికిత్స అవసరమైంది. భారీ వర్షాల వల్ల గ్రామానికి రాకపోకలు నిలిచిపోగా.. కొందరు గ్రామస్థులు అతన్ని మంచంపై ఎత్తుకుని వాగు దాటించి.. 108 వాహనంలో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు.
పొంగిన వాగుతో నిలిచిన రాకపోకలు.. సాయమందించిన గ్రామస్థులు
తీగల బంజర వద్ద పగిడేరు పొంగి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామస్థులు అతన్ని మంచంపై ఎత్తుకుని వాగు దాటించి ఒడ్డున ఉన్న 108 వాహనంపై ఎక్కించారు. తల్లాడ మండలం వెంగన్నపేటలో ఇళ్లలోకి వరదనీరు చేరుతుండగా.. ప్రజలు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.
ఇదీ చదవండి:భాగ్యనగరంలో భారీ వర్షం.. స్తంభించిన జనజీవనం