స్తంభాద్రి పట్టణాభివృద్ధి సంస్థ (సుడా) అభివృద్ధికి కృషి చేస్తామని ఛైర్మన్ విజయ్‌కుమార్ తెలిపారు. ఎన్నెస్టీ రోడ్డులో నూతన కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సమక్షంలో ఆయన కుర్చీలో కూర్చున్నారు. సుడా పరిధిలోని ఎనిమిది మండలాల్లో అభివృద్ధికి ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేల సహకారంతో పనిచేస్తామన్నారు.
సుడా నూతన ఛైర్మన్‌గా విజయ్‌కుమార్ బాధ్యతల స్వీకరణ - vijay kumar as suda new chairman
ఖమ్మం జిల్లా ఎన్నెస్టీ రోడ్డులోని నూతన కార్యాలయంలో స్తంభాద్రి పట్టణాభివృద్ధి సంస్థ (సుడా) నూతన ఛైర్మన్‌గా విజయ్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. సుడా అభివృద్ధికి మంత్రి పువ్వాడతో కలిసి కృషి చేస్తామని ఆయన తెలిపారు.
![సుడా నూతన ఛైర్మన్‌గా విజయ్‌కుమార్ బాధ్యతల స్వీకరణ vijay kumar as suda new chairman at khammam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7682505-365-7682505-1592559511075.jpg)
సుడా నూతన ఛైర్మన్‌గా విజయ్‌కుమార్ బాధ్యతల స్వీకరణ
స్థిరాస్తి వ్యాపారులు వెంచర్లు వేసేముందు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. మంత్రి అజయ్‌తో కలిసి సుడాను ముందుకు తీసుకెళ్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.