తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థిని మృతి..కుటుంబ సభ్యుల ఆందోళన - death

గురుకుల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని చనిపోయిందంటూ మృతురాలి కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

విద్యార్థిని మృతి..కుటుంబ సభ్యుల ఆందోళన

By

Published : Jun 15, 2019, 7:33 PM IST

వేసవి సెలవులు ముగించుకొని హాస్టల్​కి వచ్చిన విద్యార్థిని రెండు రోజుల్లో మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలో చోటు చేసుకుంది. తిరుమలాయపాలెం మండలం పడమటి తండాకు చెందిన నేహ... బోనకల్లు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. వేసవి సెలవులు ముగించుకుని ఈ నెల 13న గురుకుల పాఠశాలకు వచ్చింది. 14న ఉదయం వాంతులు అవటం వల్ల హాస్టల్ వార్డెన్, సిబ్బంది నేహకు మజ్జిగ తాగించారు. హాస్టల్లోనే సపర్యలు చేశారు. ఈరోజు ఉదయం నేహ పరిస్థితి విషమంగా ఉండటం వల్ల ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉదయం మరణించింది. గురుకుల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే నేహ మృతి చెందిందంటూ బంధువులు, విద్యార్థి సంఘాలు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి ఎదుట ధర్నాకు దిగారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విద్యార్థిని మృతి..కుటుంబ సభ్యుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details