రాజ్యాంగం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని.. రాజ్యాంగమే కార్మికులకు యూనియన్లు పెట్టుకునే హక్కు ఇచ్చిందని మాజీ ఎంపీ వీ హనుమంతరావు స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో విలేకర్లతో మాట్లాడిన ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసి ఉమ్మడి ఎజెండాను అమలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం పెరిగి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అందుకు దేశవ్యాప్తంగా శుక్రవారం కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
'ఉమ్మడి ఎజెండాను అమలు చేస్తున్నారు' - tsrtc updates
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసి ఉమ్మడి ఎజెండాను అమలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు వీహెచ్.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై వీహెచ్..