ఖమ్మం జిల్లా మధిర బంజారా కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 11వ వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. మే 1 నుంచి ఐదో తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
మధిరలో మే ఒకటి నుంచి వెంకన్న బ్రహ్మోత్సవాలు - venkateshwara swamy brahmotsavalu from may 1
ఖమ్మం జిల్లా మధిర బంజారాకాలనీలోని వెంకన్న 11వ బ్రహ్మోత్సవాలు మే 1వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అర్చకులు, ఆలయ అధికారులు శుక్రవారం ఆవిష్కరించారు.
![మధిరలో మే ఒకటి నుంచి వెంకన్న బ్రహ్మోత్సవాలు venkateshwara swamy brahmotsavalu from may 1 in madhira](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6736218-thumbnail-3x2-venky.jpg)
మధిరలో మే ఒకటి నుంచి వెంకన్న బ్రహ్మోత్సవాలు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరిమిత సంఖ్యలో భౌతిక దూరాన్ని పాటిస్తూ భక్తులు హాజరు కావాలని అర్చకులు సూచించారు. ఉత్సవాలు ప్రారంభయ్యే సమయానికి ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన నియమావళిని అనుసరిస్తామని వివరించారు.
ఇదీ చూడండి:భారత్కు ఏడీబీ 220 కోట్ల డాలర్ల సాయం