జనతా కర్ఫ్యూ అనంతరం ఖమ్మంలో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. రైతు బజార్‌లు తెరవకపోవటం వల్ల బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెంచేశారు. ఈరోజు నగర వాసులు ఒక్కసారిగా కూరగాయల మార్కెట్ యార్డుకు తరలిరావటం వల్ల వ్యాపారులు ఇదే అదనుగా భావించి రేట్లు పెంచారు.
ఖమ్మంలో మండుతున్న కూరగాయల ధరలు - KHAMMAM MARKET VEGITABLE PRICE HIKE
ఖమ్మంలో కూరగాయల మార్కెట్లలో ధరలు మండిపోతున్నాయి. జనతా కర్ఫ్యూ అనంతరం విపరీతంగా ప్రజలు మార్కెట్కు పోటెత్తారు. ఇదే అదనుగా భావించి వ్యాపారులు విపరీతంగా కూరగాయల ధరలు పెంచేశారు.
ఖమ్మం లో మండుతున్న కూరగాయల ధరలు
రెండు రోజుల క్రితం 10 రూపాయలు ఉన్న కిలో టమాట ఈరోజు 40 రూపాయలకు పెంచి విక్రయిస్తున్నారు. ఇలా అన్ని రకాల కూరగాయల ధరలు మూడు నుంచి నాలుగు రెట్లు పెంచి విక్రయిస్తున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చూడండి:లాక్డౌన్ను అతిక్రమించకండి.. బాధ్యతగా ఉండండి: ప్రధాని