ఎమ్మెల్సీ ఓటుకు డబ్బులిస్తామంటూ తనపై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలపై ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు. వీడియోలోని తన మాటలను ప్రతిపక్షాలు వక్రీకరించాయని తెలిపారు. తనపై బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు.
నా మాటలను తప్పుగా వక్రీకరించారు: వైరా ఎమ్మెల్యే - khammam district news
ఎమ్మెల్సీ ఓటుకు డబ్బులిస్తామంటూ తనపై వచ్చిన వీడియోలో వాస్తవం లేదని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు. తన మాటలను ప్రతిపక్షాలు వక్రీకరించాయని పేర్కొన్నారు. తనపై బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని ఎమ్మెల్యే హెచ్చరించారు.
నా మాటలను తప్పుగా వక్రీకరించారు: వైరా ఎమ్మెల్యే
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిమిత్తం నియోజకవర్గంలోని ఏన్కూరు, వైరాలో ఫిబ్రవరి 3న నిర్వహించాలనుకున్న సభలకు అయ్యే ఖర్చులు తానే ఇస్తానని... కార్యకర్తలపై భారం పడకుండా అండగా ఉంటానని చెప్పిన మాటలను వక్రీకరించారని అన్నారు. తప్పుడు ప్రచారాలు చేయకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం తనతో పాటు నడవాలని కోరారు.
ఇదీ చదవండి:నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎన్నికలకు పూర్తైన ఏర్పాట్లు