ఖమ్మం జిల్లా సింగరేణి ఆధ్వర్యంలో ఉసిరికాయలపల్లిలో నిర్మించిన సోలార్ ప్లాంట్ స్వాగత ద్వారానికి ఇల్లందు పేరు పెట్టడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సోలార్ విద్యుత్ ప్లాంట్ ముఖ ద్వారపు ఫ్లెక్సీని ఉసిరికాయలపల్లి గ్రామస్థులు ధ్వంసం చేశారు.
సింగరేణి సోలార్ ప్లాంటుకు ఆ ఊరిపేరు.. ప్రజల ఆగ్రహం! - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్
సింగరేణి ఆధ్వర్యంలో ఉసిరికాయలపల్లిలో నిర్మించిన సోలార్ ప్లాంట్‌కు ఇల్లందు పేరు పెట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ ద్వారం వద్ద ఉన్న ఫ్లెక్సీని చింపేసి ఆందోళనకు దిగారు.
![సింగరేణి సోలార్ ప్లాంటుకు ఆ ఊరిపేరు.. ప్రజల ఆగ్రహం! usirikayalapally villagers protest about solar plant name in yellandu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10011240-231-10011240-1608959726750.jpg)
సోలార్ ప్లాంట్ పేరు తగాదా... స్థానికుల ఆందోళన
సింగరేణి మండలం పరిధిలో ఉన్నందున ఉసిరికాయపల్లి లేదా సింగరేణి మండలం పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. భూములు కోల్పోయిన తమకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. మంజూరైన నిధులు ఇల్లందు ప్రాంతానికి కేటాయిస్తున్నారని రోడ్డుపై బైఠాయించారు.
ఇదీ చదవండి:వైరాలో విషాదం: భాజపా రాష్ట్ర నేత దారుణ హత్య