ఖమ్మం జిల్లా ఏనుకూరులో జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలు ఆందోళనకు దిగారు. గ్రామంలోని చెరువు వద్ద నెల రోజులుగా పనిచేస్తున్నా సరైన వేతనం ఇవ్వడం లేదని ఆగ్రహం చెందారు. అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. కూలీ రూ.25 మాత్రమే ఇస్తున్నారని గంటన్నర పాటు ఆందోళన చేశారు. మరోసారి ఈ-కొలతలు తీసి వేతనం అందజేస్తామని అధికారులు హామీ ఇచ్చాక ఆందోళన విరమించారు.
"ఉపాధి కల్పించారు... వేతనం మరిచారు" - "ఉపాధి కల్పించారు... వేతనం మరిచారు"
ఉపాధి కల్పించారు.. కానీ వేతనం ఇవ్వడం మరిచారు. నెలరోజులుగా ఎంతో కష్టపడి పనిచేస్తున్నా.. వేతనం అందక పోవడంతో ఆగ్రహం చెందారు ఖమ్మం జిల్లా ఏనుగూరు ఉపాధి హామీ కూలీలు. వేతనం ఇచ్చే వరకు పనిలోకి వెళ్లబోమని భీష్మించుకు కూర్చున్నారు.
"ఉపాధి కల్పించారు... వేతనం మరిచారు"