తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మంలో కేంద్రమంత్రి కిషన్​రెడ్డి రోడ్ షో - కేంద్రమంత్రి కిషన్​రెడ్డి రోడ్ షో

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి రోడ్ షోలు నిర్వహించారు. భాజపా అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Union Minister Kishan Reddy road show in Khammam
ఖమ్మంలో కేంద్రమంత్రి కిషన్​రెడ్డి రోడ్ షో

By

Published : Apr 27, 2021, 1:40 PM IST

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకోవడంతో.. భాజపా అగ్రనేతలు రంగంలోకి దిగి ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేపడుతున్నారు. కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి.. ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో రోడ్ షోలు నిర్వహించారు.

గుంటుమల్లేశ్వరస్వామి ఆలయం నుంచి భారీ ర్యాలీతో రోడ్​ షో ప్రారంభమైంది. గాంధీ చౌక్, పంపింగ్ వెల్ రోడ్ ప్రాంతాల్లో రోడ్ షోల్లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. భాజపా అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details