ఓ వైపు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండగా మీరిలా ప్రయాణాలు చేయడం తగదంటూ ఖమ్మం జిల్లా తల్లాడలో పోలీసులు వాహనదారులను ఆపారు. నెల రోజులుగా నిత్యం పోలీస్ చెక్‌పోస్టు వద్ద వివరిస్తున్నా ఇలా రావడం సరికాదన్నారు. జరిమానాలు, కేసులు పెడుతున్నా పట్టించుకోకపోవడం వల్ల కొద్ది సేపు చైతన్యం కల్పించారు.
మా బాధ అర్థం చేసుకోండి.. దండం పెడుతున్న పోలీసులు - police Ave the vehicles at khammam
ఖమ్మం జిల్లా తల్లాడలో పోలీసులు వినూత్నంగా వాహనదారులకు కరోనాపై అవగాహన కల్పించారు. లాక్‌డౌన్ వేళ ప్రజలు వాహనాలతో బయటకు రావడం వల్ల పోలీసులు విసుగు చెంది.. దండం పెడుతూ మా బాధ అర్థం చేసుకోండి అంటూ వేడుకున్నారు.
మా బాధ అర్థం చేసుకోండి.. దండం పెడుతున్న పోలీసులు
ఉదయం ఒక్కసారిగా ఎక్కువ వాహనాలు రావడం వల్ల ఏం చేయాలో అర్థంకాని పోలీసులు వారికి దండాలు, నమస్కారాలు పెట్టారు. ఇప్పటికైనా మీ ప్రయాణాలు మానుకోవాలని, మృత్యువు మన జిల్లా సరిహద్దుల్లో ఉందంటూ హెచ్చరించారు.
ఇదీ చూడండి :మనవరాలితో కలిసి టేబుల్ టెన్నిస్ ఆడిన మంత్రి ఎర్రబెల్లి