ఖమ్మంలో లాక్డౌన్కు ప్రజలు పూర్తిగా సహకరిస్తున్నారు. రాత్రి సమయాల్లో ప్రజలూ ఎవ్వరూ బయటకు రావటం లేదు. పోలీసులు అనేక చోట్ల బారికేడ్లు పెట్టి అడ్డుకుంటున్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. జిల్లాలో రెండో కేసు నమోదైన నేపథ్యంలో ఖిల్లా పరిసరాల్లో బందోబస్తును ముమ్మరం చేశారు.
రెండు పాజిటివ్ కేసులు.. పోలీసులు అప్రమత్తం - Clear lock on Khammam
ఖమ్మం నగరంలో ప్రజలు లాక్డౌన్కు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రజలు బయటకు రావడం లేదు. జిల్లాలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం వల్ల పోలీసులు అప్రమత్తమయ్యారు.
![రెండు పాజిటివ్ కేసులు.. పోలీసులు అప్రమత్తం two positive cases khammam police alert](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6718113-386-6718113-1586379270229.jpg)
రెండు పాజిటివ్ కేసులు.. పోలీసులు అప్రమత్తం
ఎవ్వరినీ బయటకు రానివ్వటం లేదు. బ్లీచింగ్ చల్లుతున్నారు. లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న వారి ఆకలి తీర్చేందుకు పలు యువజన సంఘాలు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వాసుత్రిలో రోగుల బంధువులకు ఆహార పోట్లాలు పంపిణీ చేస్తున్నారు.
ఇదీ చూడండి :'ధాన్యం సేకరణపై సమస్యలుంటే సంప్రదించండి'