తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండు లారీలు ఢీకొని ఇద్దరు డ్రైవర్లు మృతి - ఖమ్మం జిల్లా సీతారాంపురం వద్ద రెండు లారీలు ఢీకొని ఇద్దరు డ్రైవర్లు మృతి

ఖమ్మం జిల్లా సీతారాంపురం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీలు ఢీకొని ఇద్దరు డ్రైవర్లు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఓ క్లీనరు గాయపడ్డారు.

Two lorries collide at Sitharampuram in Khammam district
రెండు లారీలు ఢీకొని ఇద్దరు డ్రైవర్లు మృతి

By

Published : May 17, 2020, 10:26 AM IST

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని సీతారాంపురం వద్ద రెండు లారీలు ఢీకొని ఇద్దరు డ్రైవర్లు మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన ఓ క్లీనరును పెనుబల్లి ఆసుపత్రికి తరలించగా... మరొకరు సురక్షితంగా బయటపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున రెండు లారీలు ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది.

లారీలో ఇరుక్కున్న మృతదేహాలను పోలీసులు బయటకు తీయించారు. ఇందులో కృష్ణా జిల్లా మొవ్వ లంకకు చెందిన వెంకట్రావు, మహారాష్ట్ర నాందేడ్కు చెందిన ఆసీన్ అనే వ్యక్తులు మరణించారు.

ఇదీ చూడండి:వలసయేతర కూలీల ఆదాయంపైనా లాక్​డౌన్​ ప్రభావం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details