ఖమ్మంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 17వ రోజూ ప్రశాంతంగా కొనసాగుతోంది. పట్టణంలోని బస్ డిపో ఎదుట కార్మికులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా నిర్వహించారు. కార్మికులతోపాటు వామపక్ష, తెజస, ఎమ్మార్పీఎస్, కార్యకర్తలు పాల్గొన్నాడు. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. నోటికి నల్లటి దుస్తులు కట్టుకొని మౌన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
ఖమ్మంలో 17వ రోజూ కొనసాగుతున్న సమ్మె - TSRTC WORKERS STRIKE
ఖమ్మంలోని ఆర్టీసీ డిపో కార్యాలయం ఎదుట కార్మికులు, పలు సంఘాల నాయకులు ధర్నాకి దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఖమ్మంలో 17వ రోజూ ప్రశాంతంగా కొనసాగుతున్న సమ్మె
TAGGED:
TSRTC WORKERS STRIKE