ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఈరోజు ఖమ్మం బస్‌డిపో ఎదుట కార్మికులు... రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
ఖమ్మం బస్ డిపో ఎదుట కార్మికుల ఆందోళన - ఖమ్మం జిల్లాలో రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా
ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 33వ రోజూ కొనసాగుతూనే ఉంది. బస్సులను బయటకు రానీయకుండా అడ్డుకున్న కొంతమంది నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఖమ్మం బస్ డిపో ఎదుట కార్మికుల ఆందోళన
నిరసనగా డిపో నుంచి బయటకు వచ్చిన కార్మికులు ర్యాలీ తీశారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు పోలీసుల బందోబస్తు నడుమ బస్సులను బయటకు తీశారు.
ఇవీ చూడండి: డెడ్‌లైన్‌లోపు విధుల్లో చేరిన 487 మంది ఆర్టీసీ కార్మికులు
TAGGED:
TSRTC WORKERS STRIKE