ఖమ్మంలో స్తంభించిన జనజీవనం - TSRTC Strike in Khammam
ఆర్టీసీ ఐకాస ఇచ్చిన బంద్ పిలుపుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజారవాణా పూర్తిగా నిలిచిపోయింది. బంద్‌కు రాజకీయ పార్టీలతోపాటు ప్రజా సంఘాలు, విద్యార్థి, మహిళా సంఘాల సభ్యులు ప్రత్యక్షంగా ఆందోళనల్లో పాల్గొనారు.
ఖమ్మంలో స్తంభించిన జనజీవనం
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచే అన్ని ఆర్టీసీ బస్‌డిపోల వద్ద కార్మికులు, రాజకీయ పార్టీల కార్యకర్తలు, ప్రజాసంఘాలు ఉదయం నుంచీ సాయంత్రం వరకూ ఆందోళనలు, నిరసనలతో హోరెత్తించారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకోవటంతో పాటు డిపోల ఎదుట వివిధ రూపాల్లో ఆందోళనలు చేశారు. కొత్తగూడెం, భద్రాచలం డిపోల నుంచి ఒకటిరెండు సార్లు బస్సులు నడిపేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు స్వల్ప ఉద్రిక్తతలకు దారితీశాయి. ఆటో యూనియన్ కూడా బంద్‌కు మద్దతు తెలపడం వల్ల ప్రజారవాణా పూర్తిగా నిలిచిపోయింది.