ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా సాగుతోంది. రాష్ట్రకమిటీ పిలుపు మేరకు 16వ రోజు సమ్మెలో భాగంగా కార్మికులు, రాజకీయ పక్షాలు వినూత్నరీతిలో నిరసనలు, ఆందోళనలు చేశారు. ప్రయాణికులు, తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు పూలు ఇచ్చి తమ నిరసన తెలిపారు. నిన్నటి బంద్ తర్వాత మళ్లీ ఇవాళ ఉదయం నుంచి బస్సుల రాకపోకలు పునరుద్ధరించడం వల్ల ఖమ్మం బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. అధిక సంఖ్యలో బస్సులు బస్టాండ్ నుంచి బయలుదేరేందుకు సిద్ధమవ్వగా అదే సమయంలో బస్టాండ్ ఎదుట కార్మికులు, రాజకీయ పక్షాలు ఆందోళన దిగారు. రెండు గంటలపాటు ప్రయాణికులకు నిరీక్షణ తప్పడం లేదు. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య అందిస్తారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వినూత్న రీతిలో నిరసన
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 16వ రోజు సమ్మె కొనసాగుతుంది. వినూత్నరీతిలో కార్మికులు నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. రాజకీయ పార్టీ, ప్రజా సంఘాల నాయకులు ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలుపారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వినూత్న రీతిలో నిరసన