తెలంగాణ

telangana

ETV Bharat / state

మరో గుండె ఆగింది... ఆర్టీసీ డ్రైవర్​ మృతి! - తెలంగాణ ప్రభుత్వ తీరుతో మనస్తాపానికి గురై మరో ఆర్టీసీ డ్రైవర్​ మృతి!!

కృష్ణ జిల్లాలో తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్​ గుండెపోటుతో మృతి చెందాడు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మనస్తాపానికి గురై మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

ప్రభుత్వ తీరుతో మనస్తాపానికి గురై మరో ఆర్టీసీ డ్రైవర్​ మృతి!!

By

Published : Oct 20, 2019, 12:57 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లాలో టీఎస్​ ఆర్టీసీ డ్రైవర్ షేక్ ఖాజామియా మృతి చెందాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఖాజామియా... జగ్గయ్యపేటలోని తన నివాసంలో గుండెపోటుతో చనిపోయాడు. పదిహేనురోజులుగా తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో ఖాజామియా పాల్గొన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరిపై మనస్తాపం చెంది మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుడి కుటుంబానికి ​ఆర్టీసీ ఐకాస, ప్రజాసంఘాల నేతలు సానుభూతి తెలిపారు.

ప్రభుత్వ తీరుతో మనస్తాపానికి గురై మరో ఆర్టీసీ డ్రైవర్​ మృతి!!

ABOUT THE AUTHOR

...view details