ఖమ్మంలో నేడు ఆర్టీసీ బస్సులు కదిలాయి. ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య బస్సులను బయటకు తీశారు. డిపో ఎదుట కార్మికులు బస్సులను అడ్డుకునేందుకు యత్నించగా పోలీసులు వారిని వారించారు. అరెస్టులు చేస్తామని హెచ్చరించటం వల్ల వారు వెనుకకు తగ్గారు. పోలీసు బందోబస్తుతో బస్సులను బస్టాండ్ నుంచి తరలించారు. ఈరోజు రాజధాని బస్సులను ఖమ్మం- హైదరాబాద్ మార్గంలో నడిపేందుకు బయటకు తీశారు. తాత్కాలిక సిబ్బందికి శిక్షణ ఇచ్చి టికెట్ యంత్రాలు అందచేశారు.
బందోబస్తు నడుమ కదిలిన ఆర్టీసీ బస్సులు - tsrtc bus strike
ఖమ్మంలో పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఆర్టీసీ బస్సులు కదిలాయి. ఆర్టీసీ కార్మికులు బస్సులను అడ్డుకునేందుకు యత్నించగా పోలీసులు వారించారు.
బందోబస్తు నడుమ కదిలిన ఆర్టీసీ బస్సులు