ఖమ్మం కార్పొరేషన్‌పై ఎగిరిన గులాబీ జెండా - telangana varthalu
17:09 May 03
ఖమ్మం కార్పొరేషన్‌పై ఎగిరిన గులాబీ జెండా
ఖమ్మం కార్పొరేషన్‌ను తెరాస మరోసారి నిలబెట్టుకుంది. 60 డివిజన్లకుగాను.. 59 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. ఖమ్మం 10వ డివిజన్ తెరాస ఏకగ్రీవంగా దక్కించుకుంది. మొత్తం 60 డివిజన్లలో 45 స్థానాల్లో తెరాస-సీపీఐ కూటమి విజయం సాధించింది. ఎట్టకేలకు అధికారపక్షం ఖమ్మం కార్పొరేషన్‌లో సత్తా చాటింది. కాంగ్రెస్-సీపీఎం కూటమి అభ్యర్థులు 12 చోట్ల గెలుపొందారు. భాజపా ఇప్పటివరకు ఒక స్థానంతోనే సరిపెట్టుకుంది. ఇతరులు రెండు చోట్ల గెలుపొందారు.
ఖమ్మంలోని ఎస్ఆర్-బీజీఎన్ఆర్ కళాశాలలో 10 కౌంటింగ్ హాళ్లలో లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కొవిడ్ మార్గదర్శకాలు అమలయ్యేలా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇదీ చదవండి: అచ్చంపేట మున్సిపల్ ఛైర్మన్ పీఠం తెరాస కైవసం