TRS protests in sathupally: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు, యాసంగిలో ఎంత ధాన్యం కొంటారనే దానిపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. ఇప్పుడు రైతులు కోతలు ముగించి యాసంగి పంట సాగు చేసే సమయమని.. ఈ సమయంలో వారిని ఇబ్బందులు గురిచేయొద్దని కేంద్రానికి సూచించారు. తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం రాజకీయం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ఈ ఏడేళ్లలో రాష్ట్రంలో ఎఫ్‌సీఐ కొత్త గోదాములు ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. పక్షపాతధోరణి వహిస్తూ.. రాష్ట్ర మంత్రులు, ఎంపీలకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా వివక్ష ప్రదర్శిస్తున్నారని సండ్ర మండిపడ్డారు.
రాష్ట్రంలో ఎఫ్‌సీఐ కొత్త గోదాములు ఎందుకు కట్టలేదు.?: ఎమ్మెల్యే సండ్ర - paddy procurement issues in telangana
TRS protests in sathupally: తెలంగాణ రైతుల పట్ల కేంద్రం వివక్ష చూపడం సరికాదని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మండిపడ్డారు. భాజపా వైఖరిని నిరసిస్తూ సత్తుపల్లిలో రైతులతో కలిసి.. సండ్ర నిరసన ప్రదర్శన చేపట్టారు. యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న సండ్ర వెంకట వీరయ్యతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
సత్తుపల్లిలో తెరాస నిరసనలు