TRS Protest Over Paddy Procurement : తెలంగాణ రైతు గోస దిల్లీకి వినిపించేలా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు తెరాస ఆధ్వర్యంలో నిరసనలు ప్రారంభమయ్యాయి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల కేంద్రంలో తెరాస రైతు నిరసన కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యారు. రైతులు, గులాబీ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. కేంద్రం తీరుకు నిరసనగా చావు డప్పు మోగించారు. తెరాస శ్రేణులకు ఆయనతో కలిసి మోదీ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Paddy Procurement Telangana : ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణపై కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి పువ్వాడ అన్నారు. రైతులు తలెత్తుకునేలా కేసీఆర్ పథకాలు తీసుకొస్తుంటే.. మోదీ ప్రభుత్వం మాత్రం గుదిబండ మోపుతోందని ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకునే కాంగ్రెస్ దేశవ్యాప్తంగా విఫలమైందని విమర్శించారు. తెలంగాణ రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లాలని సూచించారు.
TRS Dharna Over Paddy Procurement :"కేంద్ర నిరంకుశ విధానానికి చావు డప్పు కొట్టాం. రైతుల ఆసక్తి, ఇష్టాలకు వ్యతిరేకంగా మోదీ సర్కార్ పనిచేస్తోంది. రైతులను ఈ ప్రభుత్వం చాలా కష్టపెట్టింది. వారి పోరాటానికి భయపడి దిగివచ్చి నల్లచట్టాలను రద్దు చేసుకుంది. ఏడాది పాటు కర్షకులు పోరాడారు. రైతులతో పెట్టుకున్న ఏ సర్కార్ కూడా బాగుపడలేదు. అందుకే సీఎం కేసీఆర్ అన్నదాతల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో వారికి అండగా నిలుస్తున్నారు. పంట పండించడానికి కర్షకులకు ఆర్థిక సాయం చేసిన ఏకైక సర్కార్ తెలంగాణదే. ఏకైక సీఎం కేసీఆరే."