Thummala: సీఎం కేసీఆర్ పాలనాదక్షతపై ప్రజలకు అపార నమ్మకముందని తెరాస నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పార్టీ నిర్ణయం, ప్రజాభిప్రాయం మేరకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తుమ్మల స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా మధిరలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీకి నిబద్ధతతో పని చేస్తానని ప్రకటించారు.
Thummala: తెరాసకు రెబల్‌గా మారాల్సిన అవసరం లేదు: తుమ్మల - మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Thummala: తెరాసకు రెబల్‌గా మారాల్సిన అవసరం తనకు లేదని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వ్యక్తిగత లబ్ధి కన్నా పార్టీ నిర్ణయమే నాకు ముఖ్యమని ఆయన తెలిపారు. ప్రజల అంచనాలకు తగినట్లు ప్రజాప్రతినిధుల నడవడిక ఉండాలన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తుమ్మల నాగేశ్వరరావు
తెరాసకు రెబల్‌గా మారాల్సిన అవసరం తనకు లేదని తుమ్మల వెల్లడించారు. వ్యక్తిగత లబ్ది కన్నా పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యమని అన్నారు. ప్రజల అంచనాలకు తగ్గట్టు ప్రజాప్రతినిధుల నడవడిక ఉండాలని సూచించారు. ప్రస్తుతం రాజకీయాల్లో విలువలు తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయాలు ప్రజల కోసమేనని తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.
ఇదీ చూడండి: