ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురంలో ఈనెల 13 నుంచి 17 వరకు సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నట్లు ఖమ్మం మాజీ ఎంపీ, తెరాస నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శృంగేరి పీఠానికి చెందిన సుమారు 200 మంది రుత్వికులచే ఐదురోజులపాటు ఈ యూగం నిర్వహిస్తామని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
సహస్ర చండీయాగానికి తరలిరండి: పొంగులేటి - trs leader ponguleti invitation for chandi yagam
ఖమ్మం జిల్లా నారాయణపురంలో ఈనెల 13 నుంచి 17 వరకు ఐదు రోజులపాటు సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నట్లు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. జిల్లా ప్రజలు తరలిరావాలని కోరారు.
సహస్ర చండీయాగానికి తరలిరండి: పొంగులేటి
ఇవీచూడండి: రచయిత్రి నోట... బతుకమ్మ పాట..