ఖమ్మం జిల్లా వైరాలో తెరాస 20వ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. వైరా కూడలిలో ఎమ్మెల్యే రాములు నాయక్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణలో తెరాస ఎదురులేని శక్తిగా ఎదిగిందని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయని తెలిపారు. పలు చోట్ల మార్కెఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, పురపాలిక ఛైర్మన్ సూతకాని జైపాల్లు జెండాలను ఎగురవేశారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వలసకూలీలు, పేదలకు నిత్యావసరాలను, కూరగాయలను పంపిణీ చేశారు. ఏన్కూరు, కొణిజర్ల, జూలూరుపాడు, కారేపల్లి మండలాల్లో తెరాస నేతలు, ప్రజాప్రతినిధులు జెండా ఆవిష్కరణలు, పేదలకు వితరణలు చేపట్టారు.
వైరాలో తెరాస ఆవిర్భావ వేడుకలు - Wyra MLA Ramulu Nayak Latest News
తెరాస 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో తెరాస శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. వైరా కూడలిలో ఎమ్మెల్యే రాములు నాయక్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. వలస కూలీలు, పేదలకు నిత్యావసరాలను, కూరగాయలను పంపిణీ చేశారు.
తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుకలు