ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో తెరాస ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సత్తుపల్లిలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నివాళులర్పించారు. రాష్ట్రం కోసం అమరులైన వారు చిరస్మరణీయులని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అభివృద్ధిలో ముందంజలో ఉందని తెలిపారు. పెనుబల్లి మండలంలో వీఎం బంజర్లో పార్టీ మండల అధ్యక్షులు కనగాల వెంకట్రావు, సత్తుపల్లిలో సీనియర్ నాయకులు గాదె సత్యం, వేంసూర్లో పాల వెంకట్ రెడ్డి, కల్లూరులో పాలెపు రామారావులు తెరాస ఆవిర్భావ వేడుకల్లో భాగంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు.
సత్తుపల్లిలో తెరాస ఆవిర్భావ వేడుకలు - సత్తుపల్లి తెరాస ఆవిర్భావ దినోత్సవం
తెరాస 20వ ఆవిర్భావ వేడుకలను ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నివాళులర్పించారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించి వేడుకలు నిర్వహించుకున్నారు.
సత్తుపల్లిలో తెరాస ఆవిర్భావ వేడుకలు