ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఉందని వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైరా రింగ్ రోడ్డు వద్ద పార్టీ జెండాని ఎమ్మెల్యే ఎగరవేశారు.
తెరాస ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని.. పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త పని చేయాలని కోరారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం పనిచేస్తున్నారని.. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు.