తెలంగాణ

telangana

ETV Bharat / state

మండుటెండల్లో మాడుతూనే... ఎన్నికల ప్రచారం - MLA AJAY KUMAR

ఓ వైపు భానుడి భగభగలు... మరోవైపు ఎన్నికల ప్రచారం... ప్రధాన పార్టీల అభ్యర్థులు అలుపు లేకుండా ఎండలో తిరుగుతున్నారు. ఎలాగైనా సరే గెలవాలని నియోజకవర్గమంతా పర్యటిస్తూ.. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.

మండుటెండల్లో మాడుతూనే... ఎన్నికల ప్రచారం

By

Published : Mar 30, 2019, 12:48 PM IST

మండుటెండల్లో మాడుతూనే... ఎన్నికల ప్రచారం
ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడటంతో మండుటెండల్లోనే ప్రచారం కొనసాగిస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థులైతే ప్రచార పర్వంలో మరింత దూసుకెళ్తున్నారు. తెరాస అభ్యర్థి నామ నాగేశ్వరరావు తరఫున 7 నియోజకవర్గాల్లోనూ గులాబీ నేతలు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. రోడ్ షోలు, సభలతో ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

డివిజన్ల వారీగా ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే అజయ్ కుమార్... నగర వీధుల్లో కారు గుర్తుకు ఓటేయాలంటూ ప్రజలను కోరుతున్నారు. ఇందులో భాగంగానే 35, 36 డివిజన్లలో చేపట్టిన రోడ్​షోలలో తెరాస శ్రేణులు భారీగా పాల్గొన్నాయి. ఓటర్లంతా కారు గుర్తుకు ఓటేసి నామ నాగేశ్వరరావును గెలిపించి ఎంపీగా పార్లమెంట్​కు పంపాలని ఎమ్మెల్యే అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details