తెలంగాణ

telangana

'కేసీఆర్‌ ఉన్నంతవరకు సింగరేణి సంస్థను ప్రైవేటీకరించలేరు'

By

Published : Mar 6, 2021, 11:46 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నంతవరకు సింగరేణి సంస్థను ఎవ్వరూ ప్రైవేటీకరణ చేయలేరని పట్టభద్రుల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. కారుణ్య నియామకాలు పునః ప్రారంభించిన ఘనత తెరాసకే దక్కుతుందని పేర్కొన్నారు. సత్తుపల్లి జేవీఆర్‌ ఉపరితల గనిలోని కార్మికులను కలిసి ఓట్లు అభ్యర్థించారు.

Trs election campaign in Satthupally at Khammam district
'కేసీఆర్‌ ఉన్నంతవరకు సింగరేణి సంస్థను ప్రైవేటీకరించలేరు'

సింగరేణి పరిరక్షణ కోసం తెరాస ప్రభుత్వం కట్టుబడి ఉందని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. కారుణ్య నియామకాలు పునఃప్రారంభించిన ఘనత తెరాసకే దక్కుతుందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి జేవీఆర్‌ ఉపరితల గనిలోని కార్మికులను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి ఓట్లు అభ్యర్థించారు.

లాభాల్లో ఉన్న ఎల్‌ఐసీ, రైల్వే, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వంటి వాటిని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేయాలని ప్రయత్నిస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నంతవరకు సింగరేణి సంస్థను ఎవ్వరూ ప్రైవేటీకరణ చేయలేరని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి పట్టభద్రులు ఓటేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తెరాస జిల్లా ఇంఛార్జ్​ మధు, పురపాలక సంఘం ఛైర్మన్ మహేశ్​, వైస్ ఛైర్ పర్సన్ సుజల రాణీ, డీసీసీబీ డైరెక్టర్ కృష్ణయ్య, హరికృష్ణ రెడ్డి, సాంబశివరావు, ఎండీ రజాక్‌, జేఎస్‌ఆర్‌ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:పట్టభద్రుల పోరు: కీలకంగా మారనున్న రెండో ప్రాధాన్యతా ఓట్లు

ABOUT THE AUTHOR

...view details