అభివృద్ధి నినాదమే ఎజెండాగా తెరాస ప్రచారం - telangana varthalu
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో తెరాస ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అభివృద్ధి నినాదమే ఎజెండాగా ఆ పార్టీ అభ్యర్థులు అన్ని డివిజన్లలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. గత ఐదేళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూనే..రానున్న రోజుల్లో డివిజన్ల అభివృద్ధిపై తమకున్న లక్ష్యాలే హామీలుగా ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ తెరాస అభ్యర్థులకు మద్దతుగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తెరాస కార్పొరేటర్ అభ్యర్థిగా మరోసారి బరిలోకి దిగిన సిట్టింగ్ కార్పొరేటర్‌గా తనకు డివిజన్ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటున్న 26వ డివిజన్ తెరాస అభ్యర్థి పునుకొల్లు నీరజతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
అభివృద్ధి నినాదమే ఎజెండాగా తెరాస ప్రచారం