పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ... ఖమ్మం జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్ రాజు మధిరలో ప్రచారం నిర్వహించారు. తెరాస నాయకులతో కలిసి పాదయాత్రగా ఇంటింటికి వెళ్లి రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు.
'పల్లా గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం' - mlc candidate palla rajeshwar reddy
తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ...ఖమ్మం జిల్లా మధిరలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి పట్టభద్రులను ఓటు అభ్యర్థించారు.

'పల్లా గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం'
ప్రశ్నించే నాయకుల కంటే... సమస్యలు పరిష్కరించే నాయకుడు పల్లా గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక ఛైర్ పర్సన్ లత, ఎంపీపీ లలితా తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కోరిందల్లా ఇచ్చే ముందు.. ఇవి తెలుసుకోండి!