తెలంగాణ

telangana

ETV Bharat / state

కేటీఆర్ రూ.లక్ష జరిమానా విధించినా మార్పు రాలేదు! - TRS Actives Show the Flexi at Ellandu in Khammam district

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం పెద్దఎత్తున శ్రమిస్తోంది. ఫ్లెక్సీలను నిషేధించాలని ఇప్పటికే మంత్రులు పిలుపునిచ్చారు. ఇల్లందు వెళ్లినప్పుడు..మంత్రి కేటీఆర్ ఏకంగా లక్ష రూపాయలు జరిమానా విధించారు. అయినా తీరేం మారలేదు. అదె తరహాలో మరో మంత్రికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్లీలు దర్శనమిచ్చాయి.

TRS Actives Show the Flexi at Ellandu in Khammam district
లక్ష జరిమానా వేసిన జడిసేది లేదు

By

Published : Jul 14, 2020, 7:40 PM IST

ఇటీవల ఖమ్మం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ మున్సిపల్​ ఛైర్మన్​కు రూ.లక్ష జరిమానా విధించారు. నాలుగు నెలలు తిరగక ముందే అంతా మరిచిపోయినట్టే ఉన్నారు. మళ్లీ మున్సిపాలిటీలో ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.

మంగళవారం పురపాలికలో రైతు వేదికల శంకుస్థాపన కోసం వచ్చిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​కు స్వాగతం చేప్పేందుకు ప్రధాన రహదారుల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంత్రి కేటీఆర్ ఆదేశించిన తర్వాత కూడా కార్యకర్తల్లో మార్పు రాకపోవటం వల్ల పట్టణవాసులు ఆశ్చర్యం వక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details