తెలంగాణ

telangana

ETV Bharat / state

పోడుదారులకు హక్కులు కల్పించాలంటూ ఆందోళన - తిమ్మారావుపేటలో గిరిజనుల ఆందోళన వార్తలు

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం తిమ్మారావుపేటలో గిరిజనులు ఆందోళనకు దిగారు. పోడుదారులకు హక్కులు కల్పించాలని డిమాండ్​ చేశారు.

Tribals protest at thimmaraopet in khammam district
పోడుదారులకు హక్కులు కల్పించాలంటూ ఆందోళన

By

Published : Jun 12, 2020, 7:06 PM IST

పోడుదారులకు హక్కులు కల్పించాలని కోరుతూ ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం తిమ్మారావుపేటలో గిరిజనులు ఆందోళన చేపట్టారు. తిమ్మారావుపేటలో రైతు వేదిక శంకుస్థాపనకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్​ రాగా.. సమస్యను మంత్రికి వివరించేందుకు వివిధ గ్రామాల గిరిజనులు తరలివచ్చారు. సభాస్థలం వద్ద వేచి ఉండగా.. మంత్రి అక్కడకు రాకుండా శంకుస్థాపన చేసి వెళ్లిపోవటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమస్యలు విన్నవించేందుకు వేచి ఉన్న తమ వద్దకు మంత్రి రాకపోవడం పట్ల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ కూడలి వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులు వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు.

ఇదీచూడండి: 'విద్యుత్ బిల్లులు కట్టకపోతే కరెంట్ కట్ చేయొద్దు'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details