తెలంగాణ

telangana

ETV Bharat / state

'ధాన్యం కొన్న పదిరోజుల్లో డబ్బు ఖాతాలో జమ చేస్తాం'

రైతును రాజును చేయాలనే సంకల్పంతోనే సీఎం కేసీఆర్​ రైతు సంక్షేమానికి అనేక కార్యక్రమాలు తీసుకొస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాల, పెనుబల్లి మండలం పెనుబల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి ప్రారంభించారు.

grain purchasing center in kalluru
puvvada, khammam

By

Published : Apr 6, 2021, 5:00 PM IST

దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని మంత్రి పువ్వాడ అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాల, పెనుబల్లి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి ప్రారంభించారు. రైతులకు పెట్టుబడితో పాటు రైతు బంధు, రైతు బీమా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.

రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం ఎగుమతితో సంబంధం లేకుండా వారం, పదిరోజుల్లో డబ్బు అకౌంట్లో జమ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కల్లూరు మండలంలో ప్రారంభించామని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్, ఆర్డీవో సూర్యనారాయణ, డీఆర్డీవో పీడీ శిరీష, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:మరో మహిళతో దొరికిపోయిన హోంగార్డు

ABOUT THE AUTHOR

...view details