ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని పీవీ నరసింహారావు మత్స్య పరిశోధన కేంద్రంలో మూడు రోజులపాటు ఎనిమిది జిల్లాల నుంచి వచ్చిన 50 మందికి పైగా మత్స్యకార మహిళలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
చేపల ఎంపిక, శుభ్రం చేయడం, వాటి నుంచి లభించే వివధ రకాల ఉత్పత్తులతో పిండి పదార్థాలు, రొట్టెలు, సమోసాలు, చేప బిరియాని వంటి వివిధ రకాల వంటకాలను తయారు చేయడంపై వారికి శిక్షణ ఇచ్చారు.